నిజామాబాద్ జిల్లా Indalvai Mandal పరిధిలోని గన్నారం వద్ద National Highway 44పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు.
రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. Hyderabad నుంచి Akolaకు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
