హైవేపై ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తుండగా ఓ యువకుడు లారీ ఢీకొని మృతి చెందిన విషాద ఘటన Haryanaలో చోటుచేసుకుంది.
12వ తరగతి చదువుతున్న 19 ఏళ్ల మొయిన్ ఇద్దరు స్నేహితులతో కలిసి Delhi–Mumbai Expresswayపై బైక్ రైడ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించాలని భావించి రోడ్డుపై నడుస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నారు.అప్పుడే అదుపుతప్పిన లారీ వేగంగా దూసుకొచ్చి మొయిన్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
