Narsingi పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి బాలికను తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై దాడి చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా బాలికను నిందితుడు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, రాత్రి ఒక గంట సమయంలో బాలిక మృతదేహం ఉన్న ప్రదేశాన్ని చూపించాడు.ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం మరియు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
