మియాపూర్ పరిధిలోని బాచుపల్లి రోడ్డుపై మంగళవారం ఉదయం మినీ బస్ ప్రమాదానికి గురైంది. లీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రైవేట్ మినీ బస్లో కేపీహెచ్బీ నుంచి గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్తున్న ఉద్యోగులు ప్రయాణిస్తుండగా, టాటా మోటార్స్ సమీపంలో వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఒరిగిపోయింది.ఈ ప్రమాదంలో ఒకరికి తలకు తీవ్ర గాయాలు కాగా, మిగతా తొమ్మిది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగినప్పటికీ ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
