SC వర్గీకరణపై వివాదం… అసెంబ్లీ ముట్టడికి అంబేద్కర్ సేన పిలుపు

March 18, 2026 5:11 PM

SC వర్గీకరణ అంశంపై తెలంగాణలో ఉద్రిక్తత నెలకొంది. ది నేషనల్ అంబేద్కర్ సేన నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.

బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నే శ్రీధర్ రావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, ఎస్సీ రిజర్వేషన్లను 15% నుంచి 22%కు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.సమావేశం అనంతరం అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంబేద్కర్ సేన నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media