తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులకు గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని తెలిపారు.అలాగే గృహప్రవేశ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న పాఠశాల టాయిలెట్లు, గ్రామ సమాఖ్య భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల పనులను పరిశీలించి వివరాలు సమర్పించాలని అధికారులకు సూచించారు.

