హైదరాబాద్ (బీఎన్ఎస్):
శాసనమండలి, శాసనసభలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్‌లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ , బల్మూరు వెంకట్ నర్సింగరావు , ఎమ్మెల్యేలు వేముల వీరేశం , యెన్నం శ్రీనివాస్ రెడ్డి , విజయ రమణారావు మర్యాద పూర్వకంగా కలవగా, ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.
