శేరిలింగంపల్లి మండలంలోని గోపీనగర్లో ఉన్న ఈద్గా భూమిపై ఆక్రమణ యత్నాలు జరుగుతున్నాయని మోతీ మసీద్ ఈద్గా కమిటీ, జనచైతన్య ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్, తహసీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించారు.

సర్వే నంబర్ 64/1లో ఉన్న ఈ భూమి 1973 నుంచే ఈద్గా ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ఆక్రమణల వల్ల స్థానిక కాలనీల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్థల పరిశీలన చేసి ఈద్గా భూమిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
