కడప జిల్లా మైదుకూరులో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నియామకంపై వైఎస్ఆర్సీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్య సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. పోలింగ్ బూత్‌లు ప్రజలకు సులభంగా చేరుకునేలా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకుడు వాకమల్ల రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
