సూర్యాపేటలో క్షయ నిర్మూలనకు చర్యలు వేగవంతం కలెక్టర్ తేజస్

March 24, 2026 5:52 PM

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రారంభించారు. గాంధీ పార్క్ నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను టీబీ రహితంగా మార్చేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నాయని చెప్పారు.మొబైల్ ఎక్స్‌రే యూనిట్ ద్వారా జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 52,901 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,741 మందికి టీబీ నిర్ధారణ అయింది. వీరిలో 1,356 మంది పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 385 మందికి చికిత్స కొనసాగుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media