Delhiలో కాంగ్రెస్ ఆఫీసులకు కేంద్రం నోటీసులు..

March 25, 2026 2:12 PM

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28లోగా 24, అక్బర్ రోడ్‌లో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.

దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఈ భవనం 1978 నుంచి పార్టీ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో 5, రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కోట్లా మార్గ్‌లో ‘ఇందిరా భవన్’ పేరుతో కొత్త కార్యాలయాన్ని నిర్మించుకుంది. దీనిని గతంలో Sonia Gandhi ప్రారంభించారు. నిబంధనల ప్రకారం సొంత కార్యాలయం ఉన్న తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది.అయితే ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది రాజకీయ కక్ష సాధింపుగా భావిస్తున్నామని పేర్కొంది. ఈ విషయంపై న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తూ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media