కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ జాతీయ రాజకీయాలు, అమరావతి, దళితుల పరిస్థితిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేరళలో కాంగ్రెస్, తమిళనాడు మరియు పుదుచ్చేరిలో డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయన అంచనా వేశారు. అస్సాంలో పరిస్థితి స్పష్టంగా చెప్పలేమన్నారు.అమరావతిపై విమర్శలు చేస్తూ, రాయలసీమ అభివృద్ధి నిర్లక్ష్యం అవుతోందని ఆరోపించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై బంధుప్రీతి ఆరోపణలు చేస్తూ, అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించారు.దళితులపై మాట్లాడిన ఆయన, అంటరానితనం ఇంకా కొనసాగుతూనే ఉందని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకువస్తుందని హామీ ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విధానాన్ని బలహీనమని అభివర్ణించారు. గతంలో రాజీవ్ గాంధీ యుద్ధ సమయంలో చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు.ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరతపై ప్రజల్లో భయం నెలకొన్నదని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల సంక్షేమం, ఎస్సీ కార్పొరేషన్లపై కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు.
