కర్నూలు (బీఎన్ఎస్) ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్.. శ్రీరామనవమి పర్వదినం పురష్కరించుకొని చిన్న సైజు అగ్గి పెట్టెపై అద్బుతమైన చిత్రాలు గీశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమిస్తూ మనసులో శ్రీరామ జపం చేసుకుంటూ మైక్రో పెన్నుతో, వాటర్ కలర్స్ ఉపయోగిస్తూ రామాయణంలోని ప్రధాన ఘట్టాలు అగ్గిపెట్టెపై వేసారు. కేవలం రెండు అంగుళాల పొడవు, రెండున్నర అంగుళాల వెడల్పు గల అగ్గిపెట్టె పై తన మనసులో ఉన్న రామాయన చిత్రాలను అద్బతంగా గీశాడు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ తాను వేసిన ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుండి సీతా దేవి అగ్ని పరీక్ష వరకు అన్ని ఘట్టాలు ఉన్నాయన్నారు.
