హైదరాబాద్ కోకాపేట లోని విశాఖ శ్రీ శారదా పీఠం, శ్రీ రాజ శ్యామల అమ్మవారి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ “రామః విగ్రహవాన్ ధర్మః” అని, శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపమని తెలిపారు. రాముడి మార్గాన్ని అనుసరిస్తే రామ రాజ్యం సాధ్యమని సందేశం ఇచ్చారు.అధిక సంఖ్యలో భక్తులు మరియు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొని శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులు పొందారు. పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వయంగా వైదిక ప్రక్రియను పర్యవేక్షించారు. సీతారామచంద్రుల కళ్యాణాన్ని దగ్గర ఉండి జరిపించారు. సీతారాములకు మంగళహారతి అందించి భక్తులను అనుగ్రహించారు.
