ప్రేమ విఫలం… రెండు ప్రాణాలు ముగిసిన విషాదం… కానీ ఆ ప్రేమను మరవలేని తల్లిదండ్రులు… 22 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఒక అపూర్వ సంప్రదాయం…
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన లాలు–సుక్కమ్మ దంపతులు, తమ కుమారుడు రామ్ కోటి ప్రేమకథను సజీవంగా నిలిపారు.22 సంవత్సరాల క్రితం ప్రేమించిన యువతితో పెళ్లి జరగకపోవడంతో రామ్ కోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేక, అతను ప్రేమించిన యువతి కూడా కొద్ది రోజులకే ప్రాణాలు తీసుకుంది.ఈ విషాదాన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటూ, ఆ ఇద్దరు ప్రేమికుల విగ్రహాలను ఇంటి ఆవరణలో ప్రతిష్టించారు.ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా, వారిని సీతారాములుగా భావించి సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహిస్తున్నారు.ఈ వేడుకకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అరుదైన సంప్రదాయాన్ని తిలకిస్తున్నారు.ప్రేమకు, జ్ఞాపకాలకు ఇది ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తోంది.
