Hyderabadలోని సీజీఓ టవర్స్‌లో తెలంగాణలో ఇంధన సరఫరా పరిస్థితులపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి G. Kishan Reddy అధ్యక్షత వహించారు.
పెట్రోల్, డీజిల్, CNG, LPG సరఫరా మరియు లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు.రాష్ట్రంలో ఇంధన సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు సమాచారం. వినియోగదారులకు నిరంతర సరఫరా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
