విమానాశ్రయాల్లో ‘Udan Yatri Cafe’ ₹10కి టీ, ₹20కి కాఫీ

March 31, 2026 11:57 AM

విమాన ప్రయాణికులకు తక్కువ ధరల్లో ఆహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్ యాత్రి కేఫ్‌లు’ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ కేఫ్‌లలో టీ ₹10కి, కాఫీ ₹20కి అందించడంతో పాటు తక్కువ ధరలకే స్నాక్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా 57 విమానాశ్రయాల్లో ప్రారంభించారు. తాజాగా లక్నో విమానాశ్రయంలో కూడా ఈ సేవలు ప్రారంభమయ్యాయి.కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ విస్తరణను ధృవీకరించగా, ముంబై విమానాశ్రయంలో కేఫ్‌ను సందర్శించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ చొరవను ప్రశంసించారు. ప్రయాణికులకు చౌక ధరల్లో నాణ్యమైన ఆహారం అందించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media