ప్రధాని Narendra Modi గుజరాత్లోని కోబాలో ‘సమ్రాట్ సంప్రతి మ్యూజియం’ను ప్రారంభించారు. జైనమత గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు అహింస సూత్రాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మౌర్య చక్రవర్తి Samrat Samprati పేరు మీదుగా ఈ మ్యూజియంను స్థాపించారు. ఆయన జైన తత్వాన్ని వ్యాప్తి చేసి శాంతి, కరుణ సందేశాలను ప్రచారం చేసిన నాయకుడిగా ప్రసిద్ధి చెందారు.గాంధీనగర్ సమీపంలో ఉన్న ఈ మ్యూజియంలో ప్రాచీన గ్రంథాలు, శిల్పాలు, డిజిటల్ ఇన్స్టాలేషన్లు, ఇంటరాక్టివ్ డిస్ప్లేల ద్వారా జైన సంప్రదాయాలు, చారిత్రక విలువలు ప్రదర్శిస్తున్నారు. అహింస, సత్యం, నైతిక జీవనం వంటి విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ మ్యూజియం లక్ష్యంగా ఉంది.
