తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో స్నపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవలో పాల్గొని స్వామివారి దర్శనం పొందారు.టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో సాగింది.

