ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి: కలెక్టర్ తేజస్

April 2, 2026 11:45 AM

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు తదితర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించి సభలను నిర్వహించాలని సూచించారు.ఈ సభల్లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించి, వారికి అందిన ప్రయోజనాలపై మాట్లాడించాలన్నారు. ముఖ్యంగా రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఇందిరమ్మ జీవిత బీమా, విద్యార్థుల అల్పాహార పథకం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media