తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల్లో అందించే సేవలపై 50 శాతం వరకు ఛార్జీలను పెంచింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ పెంపుతో పాటు 18 శాతం జీఎస్టీ కూడా వర్తించడంతో, మొత్తం సేవల ఖర్చు దాదాపు 77-78 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.
- కేటగిరీ-A సేవలు రూ.35 నుండి రూ.62కు పెరిగాయి
- కేటగిరీ-B సేవలు రూ.45 నుండి రూ.80కు పెరిగాయి
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు వంటి ముఖ్య సేవలకు ఇప్పుడు సుమారు రూ.80 వరకు చెల్లించాల్సి ఉంటుంది.అదనంగా, స్కానింగ్/ప్రింటింగ్ ఛార్జీలు కూడా పెంచి ప్రతి పేజీకి రూ.2.5గా నిర్ణయించారు.మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆపరేటర్ల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ పెంపుతో ముఖ్యంగా విద్యార్థులు, సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
