గంగారంలో రియల్ ఎస్టేట్ ముఠా దందా ప్రభుత్వ భూమి కబ్జా

April 2, 2026 4:58 PM

గంగారం గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించిన రియల్ ఎస్టేట్ ముఠా దందా వెలుగులోకి వచ్చింది. చందానగర్ పోలీసుల దర్యాప్తులో ఈ ఘటన బయటపడగా, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

వివరాల ప్రకారం, చందానగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 373, 374, 375లలో ఉన్న ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగింది. ఫేక్ ఇంటి నంబర్లు, పీటీఐఎన్ వివరాలు, ఇంటి ఫోటోలు సృష్టించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసి సుమారు 498 గజాల స్థలాన్ని ఆక్రమించారు.స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఈ అక్రమ వ్యవహారం బయటపడింది. ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media