కేశ ఖండన శాలను పరిశీలించిన ఈవో.

April 6, 2026 8:35 PM


సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు నిర్భయంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే విధంగా కేశఖండనశాలను ఆధునికరిస్తున్నామని దుర్గగుడి ఈవో అన్నారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా శానిటరీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. భక్తుల కేశ సమర్పణ అత్యంత పవిత్రమైనదని, కేశఖండనశాల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకూడదని క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
​ఈ సందర్భంగా
​చిన్న పిల్లలకు (పసి బిడ్డలకు) తలనీలాలు తీసే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నాయీ బ్రాహ్మణులకు సూచించారు. పసిపిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఎటువంటి చిన్న గాయం కూడా కాకుండా చాలా జాగ్రత్తగా, ఓపికగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.​దూర ప్రాంతాల నుండి ఎన్నో ఆశలతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో సిబ్బంది అందరూ ఎంతో మర్యాదగా, అభిమానంతో మెలగాలని ఆదేశించారు.
​తలనీలాలు సమర్పించిన తర్వాత భక్తులు స్నానం చేయడానికి పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లాకుల్లో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
​కేశ ఖండన అనంతరం భక్తులు స్నానాలు ఆచరించే చోట వేడి నీటి సౌకర్యం, నిరంతర నీటి సరఫరా మరియు తగినంత వెలుతురు ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కేసు సమర్పణ కోసం వచ్చే భక్తులకు సౌకర్యంపై,ఏఈవో శ్రీ తిరుమల రావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీ బలరామకృష్ణ వివరాలను అందజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media