సురక్షిత మాతృత్వ పద్ధతులు

April 8, 2026 7:52 PM

నల్లగొండ (బీఎన్ఎస్) : స్త్రీల ఆరోగ్య్య పరిరక్షణ, సాధారణ ప్రసవాలు, ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు..


ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ (6 ఏప్రిల్ నుండి 11 ఏప్రిల్ 2026 వరకు) లో భాగంగా, 3వ రోజు “సురక్షిత మాతృత్వ పద్ధతులు” పై సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవగా కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా సురక్షిత మాతృత్వ పద్ధతులు” అనే సందేశాత్మక నాటికను వైద్య సిబ్బంది ప్రదర్శించారు.. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… పీసీపీఎన్‌డీటీ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గర్భంలో శిశువు లింగ నిర్ధారణ నిషేధం మరియు దానికి సంబంధించిన శిక్షలను వివరించారు. శిశువుల సంరక్షణపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేసి, హాస్పిటల్ కి వచ్చు గర్భిణీ స్త్రీలకు సరిపడు కుర్చీలు, త్రాగునీరు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media