పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

April 8, 2026 8:38 PM

మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్బంగ నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో కోటి 91 లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు, తమ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, డాక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ , ఎల్వీ ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో మూడెకరాల స్థలంలో కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనుకోకుండా పట్టణ పి హెచ్ సి లో మందులు అందుబాటులో లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రయివేట్ మెడికల్ షాపును గుర్తించి అవసరమైన అత్యవసర మందులు అందజేసే విధంగా అనుసంధానం చేయడం జరిగిందని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media