అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన..!

April 9, 2026 7:28 PM

ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారం కార్యక్రమంలో భాగంగ 4వ రోజు AIDS awareness prevention campaign day, రెడ్ రన్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట వద్ద జెండా ఊపి ప్రారంభించి, స్థానిక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, సూర్యాపేట వరకు అనుసరించారు. ర్యాలీ సందర్భంగా “ఎయిడ్స్‌పై అవగాహన – జీవన రక్షణ”, “సురక్షిత జీవితం – ఆరోగ్య భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్రజలకు సందేశాలు అందించారు. బ్యానర్లు, పాంప్లెట్ల ద్వారా వ్యాధి నివారణ మార్గాలపై అవగాహన కల్పించారు.తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ .. HIV/AIDS పై సరైన అవగాహన కల్పించి వ్యాధి వ్యాప్తి విధానాలైన రక్త మార్పిడి, సూదులు/సిరంజీలు, తల్లి నుండి పిల్లకు సోకకుండా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా HIV పరీక్షలు చేసుకోవాలని సమాజానికి తెలియజేయడం, ఈ విషయాల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, పారా మెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు విస్తృతముగా అవగాహన కల్పించి వ్యాధి వ్యాప్తి నివారించవలెనని కలెక్టర్ సూచించారు…


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media