అక్రమార్కులకు చెక్: గంజాయి, అసాంఘిక శక్తులపై డ్రోన్ల నిఘా!

April 12, 2026 9:05 PM

కడప నగరంలో గంజాయి విక్రయాలు, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి పోలీసులు అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతూ, నింగి నుంచి డ్రోన్ల ద్వారా నేరగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల సాయంతో పారిపోతున్న వారిని సైతం గుర్తించి పట్టుకుంటున్న అధికారులు, అరెస్టయిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ డ్రైవ్ ద్వారా అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media