కీర్తన కుటుంబానికి అండగా ఉంటా..MLA పుట్టా

April 12, 2026 9:09 PM

ఖాజీపేట అగ్రహారంలో గత రెండు రోజుల క్రితం ప్రేమోన్మాది వెంకటేష్ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన కీర్తన కుటుంబాన్ని కడపజిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు భూపేష్ రెడ్డి,ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పరామర్శించారు.ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే పుట్టా మాట్లాడుతూ..విద్యార్థి కీర్తనను గొంతు కోసి చంపడం దుర్మార్గం,బాధాకరం,అంటూ ఈ సంఘటన నామనసు కలచివేసింది అన్నారు.నా నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని,మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటానన్నారు.


భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పురాణావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఇందులో ఎలాంటి సందేహ పడాల్సిన అవసరంలేదని,బాధిత కుటుంబానికి మేము,మా పార్టీ,మాప్రభుత్వము అండగా ఉంటుంది అన్నారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని సదుపాయాలు అందజేస్తామని,అలాగే నిందితునికి శిక్ష పడేలా పోలీస్ యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించానన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media