పీజీ హాస్టళ్లలో”కార్డన్ అండ్ సెర్చ్”నిర్వహించిన ఏఎస్పీ రామనాథ్ హెగ్డే

April 12, 2026 9:15 PM

కడపజిల్లా(బిఎన్ఎస్)ఏప్రిల్ 12: జిల్లాఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు మన్నూరు పి.ఎస్ పరిధిలోని బోయినపల్లిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో,ఎస్.లింగప్ప, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మన్నూరు పోలీస్ స్టేషన్ మరియు రాజంపేట అర్బన్ సిబ్బంది కలిసి బోయినపల్లి పీజీ హాస్టళ్లలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టళ్లలోని నివాస సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మరియు స్థానికులతో మాట్లాడి,వారు ఎలాంటి నేర లేదా అక్రమకార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలని సూచిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు.శాంతి భద్రతలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు.ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఈ కార్యక్రమంలో పోలీసులు హెచ్చరించారు.ఆ తర్వాత రూముల నందు మరియు హాస్టల్స్ నందు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడరాదని,ఎటువంటి గొడవలు చేసుకోరాదని, గంజాయి మరియు తదితర మత్తుపదార్థాలుసేవించరాదని మరియు పబ్లిక్ ప్రదేశాల నందు పుట్టినరోజు పార్టీలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించి ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని,విద్యార్థులకు రాజంపేట ఏఎస్పీ రామనాథ్ హెగ్డే సూచనలు ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media