భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని నేతలు పేర్కొన్నారు.

