సత్తెనపల్లి పట్టణంలోని నందిగామ అడ్డరోడ్డు వద్ద రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

చేబ్రోలు నుంచి వస్తున్న లారీ మలుపు తిరుగుతుండగా, వెనుక నుంచి మరో లారీ వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి.గాయపడిన వారిలో సుమారు 70 ఏళ్ల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి కాలు విరగగా, ఇంకొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఈ ముగ్గురు హసనాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
