నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు డ్యామ్ పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్స్పెక్టర్‌గా కామినేని లక్ష్మీ భవాని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నూతన ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు పనిచేసిన ఎస్సై రామకృష్ణ బిట్రగుంట పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
