IRAN యుద్ధ ప్రభావం: Asiaలో ప్లాస్టిక్ కొరత..

April 15, 2026 3:43 PM

Iran యుద్ధ ప్రభావంతో ఆసియా దేశాల్లో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కొరత నెలకొంది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ముడి సరుకుల సరఫరా అంతరాయం కారణంగా ప్లాస్టిక్ ధరలు పెరుగుతున్నాయి.

ఈ పరిణామంతో దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లో ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్‌కు డిమాండ్ పెరిగింది. పేపర్ ఆధారిత ట్యూబ్స్, పౌచులు వంటి ప్రత్యామ్నాయాలపై కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.ప్లాస్టిక్ బ్యాగులు, ర్యాప్ తయారీదారులు త్వరలో ధరలు 30% వరకు పెంచే అవకాశం ఉందని జపాన్ సంస్థలు పేర్కొన్నాయి. ఆసియాలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ఈ సంక్షోభం ప్రభావం మరింతగా కనిపిస్తోంది.కొన్ని కంపెనీలు ఇప్పటికే పేపర్ ఆధారిత ప్యాకేజింగ్‌కు మారుతున్నప్పటికీ, మరికొన్ని సంస్థలు ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధం కొనసాగితే ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media