జిల్లాలోని ముప్పాళ్ళ మండలం తొండపిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం తో భర్త ఆమెపై దాడి చేసి గొడ్డలితో కాలు నరికిన ఘటన కలకలం రేపింది.
భార్య భూలక్ష్మీ (33)పై అనుమానం పెంచుకున్న భర్త లక్ష్మయ్య తీవ్రంగా దాడి చేయడంతో ఆమె కాలు తెగిపడింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దాడి అనంతరం నరికిన కాలును గొనెలో వేసుకుని లక్ష్మయ్య పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
