మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై GOV అశోక్ గజపతిరాజు అసంతృప్తి

April 17, 2026 1:14 PM

గజపతినగరం నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రి సమయపాలన పాటించడంలేదని, సభలు మరియు సమావేశాలకు తరచుగా ఆలస్యంగా హాజరవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దగ్గరకు వెళ్లే సమయంలో టైమ్ సెన్స్ చాలా ముఖ్యమని, టీవీ సీరియల్స్ చూడటానికి లేదా ప్రయాణాలకు టైమ్ చూసే మనం ప్రజా సేవలో అదే క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.అధికారులు ఆలస్యంగా రమ్మంటున్నారనే వాదన సరైంది కాదని, తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అధికారులు సమయానికి ముందే హాజరవుతారని గుర్తుచేశారు. రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగాలంటే సమయపాలన, క్రమశిక్షణ తప్పనిసరి అని అన్నారు.తాత, తండ్రుల వారసత్వాన్ని కాపాడేలా పనితీరు ఉండాలని, రాజకీయాల్లో కనీసం ముప్పై సంవత్సరాలు కొనసాగాలంటే బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరమని అశోక్ గజపతిరాజు సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media