రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు గురువారం ఆకస్మిక సోదాలు నిర్వహించాయి. భూముల రిజిస్ట్రేషన్‌లో నిబంధనలు పాటిస్తున్నారా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగే విధంగా ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయా అన్న అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల వినియోగం, స్టాంప్ డ్యూటీ వసూళ్లపై అధికారులు పరిశీలించారు.అలాగే, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల జోక్యంపై కూడా ప్రత్యేకంగా ఆరా తీశారు. కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా, ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతున్నాయి.
