TG:డిజిటల్ అరెస్ట్ పేరుతో ₹42 లక్షల మోసం నిందితుడు అరెస్ట్

April 18, 2026 11:30 AM

‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వృద్ధుడిని బెదిరించి రూ.42 లక్షలు మోసం చేసిన కేసులో కీలక నిందితుడు గజర్ల అవినాష్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు.

బాలానగర్‌కు చెందిన సదానందం అనే వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని ఫోన్ కాల్ ద్వారా అతని మొబైల్ నెంబర్‌పై కేసులు ఉన్నాయని భయపెట్టి, వీడియో కాల్ ద్వారా నకిలీ విచారణ నిర్వహించి నమ్మబలికారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 15 రోజుల పాటు బెదిరింపులకు గురిచేసి, నాలుగు మ్యూల్ అకౌంట్లకు మొత్తం రూ.42 లక్షలు బదిలీ చేయించుకున్నారు.దర్యాప్తులో భాగంగా ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి సమాచారంతో అవినాష్‌ను గుర్తించారు. డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో కంబోడియాకు వెళ్లిన అతను అక్కడి నుంచి భారతీయులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ మోసాల నెట్‌వర్క్‌లో చేరినట్టు వెల్లడైంది.మార్చిలో భారత్‌కు వచ్చిన అవినాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుంచి రూ.12 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.‘డిజిటల్ అరెస్ట్’ అనే వ్యవహారం అసలు ఉండదని, ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సాయి మనోహర్ సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media