నాసిక్‌లో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లగొండలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా సంయోజక్ నరసింహ మాట్లాడుతూ, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు అవసరమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
