స్కూళ్ల సమీపంలో తంబాకు అడ్డుకట్ట “ఆపరేషన్ సేఫ్ స్కూల్”

April 18, 2026 4:55 PM

నగరంలో స్కూళ్ల సమీపంలో తంబాకు విక్రయాలు, అండర్ ఏజ్ విద్యార్థులు పొగ త్రాగుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

పోలీస్ కమిషనర్ CV Anand తెలిపిన వివరాల ప్రకారం, 5,000 మందికి పైగా సిబ్బందితో నగరవ్యాప్తంగా 500కు పైగా పాన్ షాపులను తనిఖీ చేశారు. విద్యార్థులకు తంబాకు, నికోటిన్ ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించినట్లు తెలిపారు.విద్యాసంస్థల సమీపంలో తంబాకు విక్రయాలు పూర్తిగా నిషేధించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.పబ్లిక్ ప్రదేశాల్లో అండర్ ఏజ్ పిల్లలు పొగ త్రాగడాన్ని అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని పోలీసులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media