భారత జాతీయ భద్రతా సలహాదారు Ajit Doval సౌదీ అరేబియాలోని Riyadh లో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారం, ప్రాంతీయ భద్రత అంశాలపై కీలక చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, జాతీయ భద్రతా సలహాదారు ముసాయిద్ అల్ ఐబాన్లను కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు సాగాయి.ఇటీవలే ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శితో కూడా దోవల్ సమావేశం కావడం, గ్లోబల్ భద్రత అంశాల్లో భారత్ చురుకైన దౌత్య విధానాన్ని ప్రతిబింబిస్తోంది.
