Hormuzలో కాల్పులు.. భారత నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ Viral

April 20, 2026 11:44 AM

Strait of Hormuz వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు ట్యాంకర్లపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఒక నౌక నుంచి వచ్చిన డిస్ట్రెస్ ఆడియో వైరల్‌గా మారింది.

‘Sanmar Herald’ నౌకలోని సిబ్బంది ఇరాన్ నేవీకి “మీరు అనుమతి ఇచ్చారు.. ఇప్పుడు కాల్పులు చేస్తున్నారు.. మేము వెనక్కి వెళ్తాం” అంటూ సందేశం ఇచ్చిన ఆడియో బయటకు వచ్చింది. ఈ ఘటన సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.మరో నౌక Jag Arnav కూడా కాల్పులకు గురైనట్లు సమాచారం. అయితే రెండు నౌకలు సురక్షితంగా వెనక్కి మళ్లాయి.ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరింది. సముద్ర మార్గాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతం Iran-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి కార్యకలాపాలపై అనిశ్చితి కొనసాగుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media