ముంబైలోని లెన్స్‌కార్ట్ స్టోర్‌లో బీజేపీ నేత నాజియా ఎలాహి ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. మంగళసూత్రం, తిలకం ధరించడంపై స్టోర్‌లో నిషేధం విధించారని ఆరోపిస్తూ ఆమె స్టోర్ యాజమాన్యాన్ని నిలదీశారు.

హిందూ సంప్రదాయాలపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రశ్నించిన నాజియా, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొంతమంది సిబ్బందికి తిలకం దిద్ది “జై శ్రీరామ్” నినాదాలు చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుండగా, సంస్థ నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
