AP:పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ వార్..! viral video

April 21, 2026 4:42 PM

పిఠాపురంలో కూటమి పార్టీల నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పాడ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరియు జనసేన నేత పెండెం దొరబాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, దీనిపై జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు స్పందించడంతో మాటామాటా పెరిగింది.ఈ క్రమంలో దొరబాబు కలుగజేసుకుని వర్మపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ-జనసేన కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకుంటూ తోపులాటకు దిగారు.సమయానికి ఇతర నాయకులు జోక్యం చేసుకోవడంతో పెద్ద గొడవ తప్పింది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media