కంచన్‌బాగ్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత: కవితను అడ్డుకున్న police

April 24, 2026 12:05 PM

హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన కవితను అర్ధరాత్రి సమయంలోనే నిలిపివేయడం వివాదానికి దారి తీసింది.

ఈ సందర్భంగా కవిత పోలీసులను ప్రశ్నిస్తూ, తాను ఆస్పత్రిలోకి ఎందుకు వెళ్లకూడదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి వైద్యులు శంకర్ గౌడ్ 80 శాతం కాలిన గాయాలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అయితే తెల్లవారే సరికి ఆయన మరణించారని ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఈ ఘటన జరిగిందని కవిత ఆరోపించారు. ఈ మరణాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యంగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.మృతుడి కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణ వంటి కార్మికుల ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media