తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
సమ్మె నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన మృతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, శంకర్ గౌడ్ కుటుంబానికి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
