ప్రొద్దుటూరు హత్యలో ఓఇల్లాలు.. ప్రియుడు..ఓ రౌడీషీటర్..!!

April 24, 2026 4:14 PM

కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనంగా మారిన హత్యకుట్ర కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు భార్య, ఆమె ప్రియుడు, సుపారీ గ్యాంగ్‌తో కలిసి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు. శిల్పారెడ్డి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగసుధీర్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్తకు తెలిసిన తరువాత తరచూ గొడవలు జరిగాయి.

దీంతో భర్తను తొలగించుకోవాలని నిర్ణయించిన శిల్పారెడ్డి, ప్రియుడు నాగసుధీర్ సహాయంతో రౌడీషీటర్ వినయ్ ద్వారా సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించారు. ఈ హత్య కోసం రూ.10 లక్షల ఒప్పందం కుదుర్చుకుని, ముందుగా రూ.5 లక్షలు చెల్లించారు. ఇందుకోసం శిల్పారెడ్డి సుమారు 14 తులాల బంగారాన్ని ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.ప్రణాళిక ప్రకారం, బైక్‌పై వెళ్తున్న ఈశ్వర్ రెడ్డిని కారుతో ఢీకొట్టి, అనంతరం కత్తులతో హతమార్చాలని ప్రయత్నించారు. అయితే బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో కుట్ర వెలుగులోకి వచ్చింది.ఏఎస్పీ విభూ కృష్ణ పర్యవేక్షణలో పోలీసులు వేగంగా స్పందించి, మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కత్తులు, రాడ్లు, రూ.5 లక్షల నగదు, రెండు కార్లు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media