కడప జిల్లా బద్వేలు పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ YS Avinash Reddy, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ అవినాష్ రెడ్డి, B. R. Ambedkar సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషి వల్లనే దేశ ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు.

కార్యక్రమం అనంతరం బద్వేల్ నియోజకవర్గ రైతులు ఎంపీని కలిసి తమ సమస్యలను వివరించారు. రబీ సీజన్లో పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర అమలు చేయడం లేదని, కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతులతో మాట్లాడిన ఎంపీ, జిల్లా వ్యవసాయ మరియు మార్కెటింగ్ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం మార్కెట్లో 78 కిలోల బస్తా వరి రూ.1500కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని, అయితే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1830గా ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు అవినాష్ రెడ్డి తెలిపారు.
