బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి Amit Shah ధీమా వ్యక్తం చేశారు.
కోల్కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన, తొలి దశలో జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110కు పైగా సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు. బెంగాల్ ప్రజలు ఇప్పటికే తమ భవిష్యత్తును నిర్ణయించుకున్నారని, ప్రధాని Narendra Modi నాయకత్వంలో అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు.రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ బీజేపీకి అనుకూలంగా ఉందని, “దీదీ ఇంటికి.. బీజేపీ అధికారంలోకి” అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు.బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
