అనంతపురం జిల్లా పుట్టపర్తిలో Sathya Sai Baba 15వ ఆరాధన మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో మహా నారాయణ సేవ కార్యక్రమం చేపట్టారు.

అన్నదానం, వస్త్రదానం రూపంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో 45,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. సాంప్రదాయ పూజల అనంతరం ప్రారంభమైన సేవలో భక్తులకు అన్నప్రసాదంతో పాటు చీరలు, ధోతీలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, ట్రస్టీలు, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.భారీ ఎండల మధ్య కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవాదళ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. నీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పిస్తూ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.అలాగే ప్రసాంతి నిలయంలో సాయి పంచరత్న కృతులతో సంగీత కార్యక్రమం, భజనలు నిర్వహించి, మంగళహారతితో కార్యక్రమం ముగిసింది.

