హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS Praveen Kumar సంచలన ఆరోపణలు చేశారు. జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలపై UAPA చట్టాన్ని ప్రయోగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల కోసం పోలీసు శాఖను, ప్రభుత్వ సంస్థలను వినియోగిస్తోందని ఆరోపించిన ఆయన, “నేడు ఒక మీడియా ప్లాట్‌ఫామ్‌పై కేసులు పెడితే, రేపు ఇతర మీడియా సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది” అని హెచ్చరించారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం అణచివేయాలని కుట్ర పన్నిందని, అదే కారణంగా నర్సంపేటకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై, సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, UAPA వంటి చట్టాలు సాధారణంగా తీవ్రవాదులపై మాత్రమే ప్రయోగించాల్సిందని గుర్తుచేశారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
